Thursday, December 19, 2024

డ్రగ్స్ స్మగ్లర్ సోఫిన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతులకు డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారంలోకి దింపుతున్న స్మగ్లర్‌ను సైబరాబాద్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 8గ్రాములు ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మహారాష్ట్ర, కొల్లాపూర్‌కు చెందిన సోఫిన్ అబ్బాస్ పటేల్ పూణేలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు యువతులకు మత్తుమందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇలా 60మంది యువతులను వ్యభిచారంలోకి దింపాడు. డిసెంబర్,2022లో సైబరాబాద్ పోలీసులు ఈ ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా వ్యవహారాన్ని బట్టబయలు చేసి పలువురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Also Read:ఆ ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సెలవులు: కేంద్రం

వారిని విచారించగా ప్రధాన నిందితుడిగా ఉన్న సోఫిన్ పేరు బయటికి వచ్చింది. సోఫిన్ కోసం అప్పటి నుంచి సైబరాబాద్ పోలీసులు వెతుకుతుండగా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సోఫిన్ చాలా రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇతడే అదీం అనే వ్యక్తికి డ్రగ్స్, యువతులను సప్లయ్ చేసేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. అదీంను అరెస్టు చేయడంతో ప్రధాన నిందితుడైన సోఫిన్ విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News