Sunday, December 22, 2024

బొల్లారంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐడిఎ బొల్లారం లోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం ఇచ్చింది. ఇంటర్ పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేపట్టారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపీడ్రిన్ డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్న కస్తూరిరెడ్డి నల్లపొడిని అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నారు. కొంత వరకు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News