Sunday, December 22, 2024

‘విశాఖ డ్రగ్స్ వెనకాల చంద్రబాబు, పురందేశ్వరి ఉన్నారు’

- Advertisement -
- Advertisement -

విశాఖలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ వెనకాల టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన వదిన, ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత పురందేశ్వరి, మరికొందరు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంటర్ పోల్ అందించిన సమాచారంతో విశాఖలోని సిబిఐ, కస్టమ్స్ అధికారులు కలసి ఒక ప్రైవేట్ కంటైనర్ లో బ్రెజిల్ నుంచి వచ్చిన 25వేల కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సజ్జల  శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ నిందితులతో తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. దీనినుంచి తప్పించుకునేందుకు తమపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో గంజాయి సాగును చంద్రబాబు పెంచి పోషించారని, తమ ప్రభుత్వ హయాంలో గంజాయి వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని సజ్జల చెప్పారు. ఈ వ్యవహారంలో తప్పుడు వార్తలు రాస్తున్న పత్రికలపై చర్య తీసుకోవాలంటూ ప్రెస్ కౌన్సిల్ కు లేఖ రాస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News