Wednesday, January 22, 2025

డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌కు హైకోర్టు షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మాదాపూర్ డ్రగ్స్ కేసుల సినీ నటుడు నవదీప్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేయొద్దని నవదీప్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు నవదీప్ పిటిషన్‌ను కొట్టివేసింది. నవదీప్ పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్ట్ కు తెలిపారు. ఈ కేసులో నవదీప్‌కు 41ఎ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

కాగా, నైజీరియన్లు నుంచి సినీ నటుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బయటపెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సినీ నిర్మాత ఉప్పల రవీ, సినీ నటుడు నవదీప్ పరారీలో ఉన్నారు. ఇందులో సినీ నిర్మాత రవి పరారీలో ఉండగా, తనను అరెస్టు చేయవద్దని నవదీప్ హైకోర్టులో పిటీషన్ వేశాడు. దీంతో కోర్టు సినీనటుడు నవదీప్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే డ్రగ్స్ వాడిన పలువురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News