Monday, January 20, 2025

డ్రగ్స్ కలకలం

- Advertisement -
- Advertisement -

ది కేవ్ పబ్‌లో సైకడైలిక్ డ్రగ్స్ పార్టీ లిమిట్ దాటి డిజె సౌండ్
గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయం డిజె గౌరవ్‌తో
కోడ్ లాంగ్వేజీలో డ్రగ్స్ కోసం కస్టమర్ల చాటింగ్, డ్రగ్స్,
గంజాయి గుర్తింపు మత్తు పదార్థ్దాలు సేవించిన 24 మంది
అరెస్ట్ పరారీలో నలుగురు పబ్ యజమానులు
గచ్చిబౌలిలో పట్టుబడ్డ వారిలో సినీ, వ్యాపార ప్రముఖులు,
ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని మ రోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సైబరాబాద్ పో లీసు కమిషనరేట్ పరిధిలో రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండ సమీపంలోని ఖజాగూడలో ది కేవ్ పబ్‌పై దాడి చేసిన పోలీసులు డ్ర గ్స్, గంజాయిని గుర్తించారు. జాయిం ట్ ఆపరేషన్ చేపట్టిన సైబరాబాద్ ఎస్వోటీ, టిజి న్యాబ్ అ ధికారులు మత్తుపదార్థాలు సేవించిన 24మంది ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ, వ్యా పార ప్రముఖులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. కేవ్ పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ చిక్కిన ప్రముఖులలో ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర, అకౌంటెంట్ ఆదన్ బారి, అమెజాన్ సీనియర్ అ సిస్టెంట్ ఎండీ షఫీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ బ గానీ, ఎవరెస్ట్ మసాల వ్యాపారవేత్త మనీష్ గిరిధ ర్, యూనిమేటర్ చింతం పూజిత్. మ్యూజిషియ న్ అబ్దుల్లా అయూబ్, వ్యాపారవేత్త మమ్మద్ రఫీ డిజె ఆపరేటర్ సందీప్ శర్మ, గౌరవ్, మధుసూ ద న్, నవాజుద్దీన్, రోహిత్ శర్మ, టిసిఎస్ ఉద్యోగి నారేడుమల్లి సందీప్, జిఎఫ్‌ఎక్స్ ఆర్టిస్ట్ పోతూరి వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. మెుత్తం 55మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24మందికి పా జిటివ్ తేలింది.

ది కేవ్ పబ్‌లో పని చేసే అబ్దుల్ అ యూబ్ అనే డిజె కూడా మత్తుపదా ర్థాలు సేవించాడు. మేనేజర్ ఆర్.శేఖర్‌ని కూ డా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 24మంది కూడా పబ్ బయటే మత్తుపదార్థాలు తీసుకుని లోపలికి వచ్చారని, విచారణ అనంతరం పబ్‌ను మూసివేస్తామని పోలీసులు తెలిపారు. పబ్ యజమానులు నలుగురినీ త్వరలో అదుపులోకి తీసుకుంటామని, గతంలోనూ ఈ తరహా పార్టీలు ఇక్కడ జరిగాయనే అనుమానాలు ఉ న్నాయని పోలీసులు పేర్కొన్నారు. పబ్ ఓనర్స్‌ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందన్నారు.

డ్రగ్స్ పార్టీ జరిగినట్లు గుర్తింపు

ఇదిలాఉండగా, మణికొండ ది కేవ్ పబ్ కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. పబ్ లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీకండ్ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీలో 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో డిజె గౌరవ్ హోరెత్తించారు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డిజె ఆర్టిస్ట్ గౌరవ్ తో కాంటాక్ట్లో ఉన్నట్లు గుర్తించారు. గౌరవ్ తో కోడ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్ కోసం కస్టమర్స్ చాటింగ్స్ చేశారు. డిజె గౌరవ్‌కు హైదరాబాద్ లో ప్రము ఖుల కాంట్రాక్ట్‌పై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీలో 24 మంది డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది.

పబ్ ఓనర్స్ ముగ్గురిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పబ్ లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి డిజె ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వహకులు వినియోగదారులకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. తరచుగా అన్నీ పబ్బుల్లో తనిఖీలు చేస్తున్నామని డ్రగ్స్ సరఫరా చేసినా, ఎవరైనా వాటిని సేవించినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అమెజాన్, టిసిఎస్ వంటి సంస్థలు తమ ఉద్యోగులు డ్రగ్స్ వినియోగించకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని మాదాపూర్ డిసిపి వినీత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News