Monday, December 23, 2024

పబ్బుల్లో అశ్లీలం

- Advertisement -
- Advertisement -

Drugs, rave parties, obscene dance in pub

వరుసగా దాడులు చేస్తున్న పోలీసులు
మూడు పబ్బుల్లో డ్యాన్సర్లతో నృత్యాలు
డబ్బు సంపాదనకు అడ్డదారులు
కస్టమర్ల జేబులు ఖాళీ చేయడమే టార్గెట్

మనతెలంగాణ, హైదరాబాద్ : పబ్బులపై వివాదాలు ఇంత అంతా కాదు, రోజుకో వివాదంతో నిత్యం పబ్బులు నలుగుతున్నాయి. వారాంతంలో సేదతీరేందుకు నగరంలో ఏర్పాటు చేసిన పబ్బులు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చుట్టుపక్కల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని పలువురు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ వివాదాలు ఇలా కొనసాగుతున్న క్రమంలోనే డ్రగ్స్ దందాకు అడ్డాగా పబ్బులు మారాయని, ఆయా యాజమాన్యాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి వద్ద నుంచి కొనుగోలు చేసి పబ్బులకు వచ్చే వారికి విక్రయిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఎన్ని కావాలంటే అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు పబ్బుకు వచ్చే కస్టమర్లకు విక్రయిస్తున్నారు. పబ్బుల్లో డ్రగ్స్, రేవ్‌పార్టీలు, అశ్లీల నృత్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బుల సంపాదన కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అంతచేస్తున్నాయి. సమయపాలన, సౌండ్ గురించి ఎంత తక్కువ చెబితే అంతమంచిది, తమ పరపతిని ఉపయోగించి నిర్ణీత సమయం ముగిసినా పబ్బులు నడిపిస్తున్నారు.

పబ్బుల యానివర్సరీలకు పోలీసుల నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని అదనపు సమయం నడుపుతున్నారు. దీని పేరు చెప్పి పబ్బులు ప్రత్యేకంగా ఆఫర్లు ఇస్తుండడంతో చాలామంది పబ్బులకు వస్తున్నారు. పబ్బుల లోపల జరిగే అరాచకాలు చాలా ఉన్నాయి, లిస్బన్ పబ్బులో కస్టమర్లపై బీరు సీసాలతో సిబ్బంది, మేనేజర్ దాడి చేయడంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్‌లోని పబ్బులో ఫార్మాస్యూటికల్ కంపెనీ రేవు పార్టీ నిర్వహించడంతో సంచలనంగా మారింది, నగర శివారులోని ఫార్మ్‌హౌస్‌లో రహస్యంగా నిర్వహించే రేవ్‌పార్టీని ఏకంగా నగరం నడిబోడ్డున పబ్బులో నిర్వహించడంతో పలు విమర్శలకు దారితీసింది. వీకెండ్‌లో సేదతీరేందుకు ఏర్పాటు చేసిన పబ్బులు రేవ్‌పార్టీలకు కేంద్రంగా మారడంపై వివాదం చెలరేగింది. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అంబ్ మింక్ పబ్‌పై పోలీసులు దాడి చేయడంతో రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. ఈ పార్టీలో పలువురు సెలబ్రిటీల పిల్లలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నయా దందా నృత్యాలు…

పబ్బులపై డ్రగ్స్ తదితర ఆరోపణలు రావడంతో నిర్వాహకులు కొత్త ప్లాన్ వేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకుని వచ్చి పొట్టి దస్తులు వేసి అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. పబ్బులకు వచ్చే వారిని జేబులను ఖాళీ చేయడమే టార్గెట్‌గా చేసుకుని యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు. ఈ విషయం సికింద్రాబాద్‌లో ఉన్న టకీల పబ్బులో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడి నిర్వాహకులను అరెస్టు చేశారు. ఇది మరవక ముందే సికింద్రాబాద్‌లోని బసేరా హోటల్‌లో ఉన్న పబ్బుపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కస్టమర్ల వలే వెళ్లి అక్కడ జరుగుతున్న భాగోతాన్ని బయటపెట్టారు. పదిమంది యువతులు అదుపులోకి తీసుకున్నారు.

కోర్టుల్లో కేసులు…

అర్ధరాత్రి వరకు అధిక శబ్దాలతో పబ్బులు నిర్వహించడంతో ఇబ్బందులు పడుతున్నామని పలు కాలనీ అసోసియేషన్లకు చెందిన వారు హైకోర్టులో కేసు వేశారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పది పబ్బులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని కోర్టులో పిటీషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్గరాత్రి వరకు పబ్బులు నిర్వహించడం, సౌండ్ ఎక్కువగా పెట్టడం, సమీపంలోని వారు ఇంటికి వెళ్లకుండా కార్ల పార్కింగ్, పబ్బులో తాగి బయటికి వచ్చిన వారు రోడ్లపై చేస్తున్న హంగామాతో ఇబ్బందులు పడుతున్నామని రెసిడెన్షియల్ అసోషియేషన్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News