Thursday, January 23, 2025

అక్రమ దందాలకు నెలవు డార్క్‌వెబ్..!

- Advertisement -
- Advertisement -

నిఘాకు చిక్కకుండా..దర్జాగా మత్తుపదార్థాలు,
తదితరాలు క్రయ, విక్రయాల జోరు…!!

Drugs sale through Dark web
మన తెలంగాణ/హైదరాబాద్: టెక్నాలజీ నానాటికి విస్తృతమవుతోన్న వేళ.. ఈ టెక్నాలజీని కొందరు మంచికి వినియోగిస్తే ఇంకొందరు మాత్రం చెడుకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మత్తు పదార్థల అమ్మకాల ప్రక్రియలో ఎవరికీ తెలియని టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అదో పెద్ద మాఫియా లోకంగా డార్క్‌వెబ్ మారింది. ఈ డార్క్‌వెబ్‌తో అధికారులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. క్రయవిక్రయాలు జరిపిన డాటాను సేకరించడం వారికి పెద్ద సవాలుగా పరిణమిస్తోంది. మత్తు పదార్థమైన ఎల్‌ఎస్‌డి బ్లాట్స్ డార్క్ నెట్ నుంచి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్న కూకట్‌పల్లి, షాబాజ్‌నగర్‌లకు చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్‌లను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు గత నెల 24న పట్టుకున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సియు) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను అధికారులు ఫిబ్రవరి 26న బట్టబయలు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్‌నెట్ నుంచి బ్లాట్స్‌ను విక్రయించాడు. ఈ డార్క్‌నెట్ నుంచి పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కొనుగోలు చేశారని అధికారుల వెల్లడించారు. అధికారులకు డార్క్‌నెట్ లేదా డార్క్‌వెబ్‌తో ఎన్నో సవాళ్లు ఎదురవుతుండటంతోత పాటు నిందితులను పట్టుకున్న తరువాత వారు క్రయవిక్రయాలు జరిపిన డాటాను సేకరించడం పెద్ద సవాలుగా పరిణమించింది. డార్క్‌నెట్‌లో మత్తు పదార్థాలు కాకుండా క్రైమ్‌కు సంబంధించి వస్తువులైన తుపాకులు, కత్తులు తదితర వస్తువులు విక్రయాలు చేయవచ్చు.

కనిపించే ప్రపంచంలో మాఫియా డాన్లు రాజ్యమేలితే.. ఇంటర్‌నెట్‌లోని డార్క్‌నెట్‌గా పిలిచే వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు పెద్ద ఎత్తున కొనసాగుతుంటాయి. అక్రమ దందాలకు డార్క్ వెబ్ ఓ స్పాట్‌గా మారింది. అందరు వాడే కంప్యూటర్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టం, పలు చిరునామాలతో ఇంటర్‌నెట్‌లో ఉండే వెబ్‌సైట్లు అందరికీ తెలిసినవే. అయితే ఇటీవల కాలంలో అనేక ఈ-కామర్స్ దిగ్గజాలు వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చి, ప్రతి చిన్న వస్తువు నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.

ఈ ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి నిఘాకు చిక్కకుండా తమ వినియోగదారులకు మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మత్తు పదార్థల ముఠాలు ఇంటర్‌నెట్‌లోని అండర్ వరల్డ్ ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో నేడు చాలా రకాల మత్తు పదార్థలు, ఆయుధాలను క్రయవిక్రయాలు చేస్తున్నారు. దీన్ని సాంకేతిక భాషాలో డీప్ వెబ్, అండర్‌గ్రౌండ్ వెబ్, డార్క్ వెబ్ అని సంబోదిస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News