Tuesday, November 5, 2024

బంజారాహిల్స్‌లో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Drugs Seized In Banjara Hills Hyderabad

30 గ్రాముల ఎండిఎంఏ, 10 కిలోల గంజాయి, 50 గ్రాముల చరాస్, 4 ఎల్‌ఎస్‌డి బోల్స్ స్వాధీనం
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన ఎక్సైజ్ సిబ్బంది

హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది బంజారాహిల్స్‌లో శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల ఎండిఎంఏ, 10 కిలోల గంజాయి, 50 గ్రాముల చరాస్, 4 ఎల్‌ఎస్‌డి బోల్స్, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన మానుకొండ సత్యనారాయణ అలియాస్ సాతి గోవాలో ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. నగరంలోని కొండాపూర్‌కు చెందిన మారడి శివశంకర్‌రెడ్డి, బల్కంపేటకు చెందిన గంధం మణికాంత్ , డార్జిలింగ్‌కు చెందిన శిల్పా రాయి నగరంలోని టోలీచౌకిలో ఉంటోంది. ముగ్గురు వ్యక్తులు గోవాలో ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న సత్యనారాయణ కమీషన్ ఇచ్చి నియమించుకున్నాడు.

శిల్పారాయి గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి నగరంలోని శివశంకర్‌రెడ్డి, మణికాంత్‌కు ఇచ్చేది. వాటిని వీరు ఇద్దరు కలిసి అవసరం ఉన్న వారికి ఎండిఎంఏ గ్రాముకు రూ.5,000, ఎల్‌ఎస్‌డి బోల్ట్‌ను రూ.2,000లకు విక్రయించేవారు. దీనిని విక్రయించినందుకు సత్యనారాయణ ఇద్దరికి గ్రాముకు రూ.500, రూ.1,000 ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే శిల్పారాయ్ డ్రగ్స్ తీసుకుని నగరానికి వచ్చి ఓయో రూములో ఉంది. డ్రగ్స్‌ను ఇద్దరికి అందజేసి తిరిగి వెళ్లేందుకు బస్సులో టికెట్ బుక్ చేసుకుంది. శిల్పారాయ్‌ను బస్సు ఎక్కించేందుకు ఇద్దరు రాగా విషయం ఎక్సైజ్ సిబ్బందికి తెలిసింది. వెంటనే అక్కడికి వచ్చిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం అమీర్‌పేట ఎక్సైజ్ సిబ్బందికి అప్పగించారు. సిఐ నరేందర్, ఎస్సై నజీర్‌హుస్సేన్, హెచ్‌సిలు భాస్కర్‌రెడ్డి, అజీం, శ్రీధర్, పిసిలు ప్రకాష్, రాకేష్, సాయి, గోపాల్, తేజేశ్వర్, కరన్‌సింగ్, బాలు నాయక్, అన్నోజి రావు, సరస్వతి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News