Wednesday, January 22, 2025

నార్సింగిలో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

యువతి అరెస్టు, సినీ ప్రముఖులతో ఆమెకు సంబంధాలు

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ యువతిని ఎస్‌ఓటి పోలీసులు నార్సింగి వద్ద సోమవారం పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 4 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరానికి చెందిన ఉనీత్‌రెడ్డి, లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. లావణ్య హ్యాండ్ బ్యాగులో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఓ హీరో ప్రియురాలైన లావణ్య సంగీతం టీచర్‌గా పనిచేస్తోంది. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు బయటికి వచ్చినా కూడా తప్పించుకుంది. దీంతో లావణ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని పోలీసులు కొంత కాలం నుంచి నిఘా పెట్టారు. ఈక్రమంలోనే లావణ్య ఇంటి నుంచి డ్రగ్స్ తీసుకుని వెళ్తోందనే సమాచారం పోలీసులకు వచ్చింది.

ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు నార్సింగిలో ఆర్‌టిసి బస్సు ఎక్కుతుండగా పట్టుకున్నాని, ఆమె బ్యాగును తనిఖీ చేయగా అందులో ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తనకు ఉనీత్ రెడ్డి డ్రగ్స్ విక్రయించినట్లు చెప్పింది. ఉనీత్ కొద్ది రోజుల క్రితం గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గోవా నుంచి ఎండిఎం డ్రగ్స్ 4 గ్రాములు తీసుకుని వచ్చి లావణ్యకు ఇచ్చినట్లు ఎస్‌ఓటి పోలీసులకు తెలిసింది. ఇద్దరిపై ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. లావణ్యకు సీని పరిశ్రమలోని పలువురితో పరిచయాలు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News