Monday, December 23, 2024

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Drugs Seized in Rajendra Nagar

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో సన్ సిటీలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సన్ సిటీలో కొకైన్ సరఫరా చేస్తుండగా నైజీరియాకు చెందిన డానియల్ ను అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో 10 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసున్నారు. నైజీరియా నుంచి స్టూడెంట్ వీసా పై డానియల్ ఢిల్లీకి వచ్చాడు. అక్కడినుంచి నెల రోజుల క్రితం డ్రగ్స్ తో పాటు నిందితుడు హైదరాబాద్ కు వచ్చాడు. ఢిల్లీ నుంచి కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ ను హైదరాబాద్ కు సప్లై చేస్తున్నాడు. సింగం సినిమా తరహాలో నిందితుడిని ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. కొకైన్ ఎవరికి పంపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News