- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. 25 కిలోల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖకు చేరింది. 25 కిలోల చొప్పున వెయ్యి డ్రగ్స్ బ్యాగులున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం డ్రగ్స్ 25,000 కిలోలు. ప్రైవేట్ ఆక్వా ఎగుమతుల కంపెనీ ద్వారా డ్రగ్స్ వచ్చింది. ఇంటర్ పోల్ సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగింది. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్ట్ నుండి వచ్చిన కంటైనర్ జర్మనీ హ్యాంబర్గ్ మీదగా ఈ నెల 16న విశాఖ వచ్చినట్లు గుర్తించారు. విశాఖ సిబిఐ, కస్టమ్స్ అధికారులను ఢిల్లీ సిబిఐ అప్రమత్తం చేసింది. సిబిఐ ఈనెల 19న నార్కోటిక్స్ నిపుణులతో విశాఖ వచ్చి నిర్ధరించకునట్లు సమాచారం. ఆపరేషన్ గరుడలో భాగంగా సిబిఐ డ్రగ్స్ పట్టుకుంది. మాదక ద్రవ్యాల సరుకును స్వాధీనం చేసుకున్న అధికారులు సరుకుదారు, ఆక్వా ఎగుమతుల సంస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
- Advertisement -