Friday, December 20, 2024

డ్రగ్స్ కలకలం

- Advertisement -
- Advertisement -

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పటిష్ట నిఘా

మన తెలంగాణ/హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీ సుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించా రు. 100 గ్రాముల ఎండిఎంఎ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ సీజ్ చేశారు. పంజాబ్ లోని ఓ ప్రముఖ యూనివర్శిటీలో చదువుతున్న  ఇద్దరు విద్యార్థులు నవీన్, సాయిలను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయించేందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్‌లో బ్రౌన్ షుగర్ బయటపడడం ఇదే తొలిసారి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్చేందుకు ఇలా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అటు, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట్లో ఎస్వోటీ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. శివరాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇంట్లో రూ.2 లక్షల విలువైన 7.5 గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్స్ బెంగుళూరు నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. నగరంలోని మీర్ పేటలోనూ డ్రగ్స్ తరలిస్తోన్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశా రు. న్యూ ఇయర్ వేడుకల్లో మత్తు పదార్థాలు విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా, పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి ఈ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయి న్, రూ.10 వేలు, ఓ బైక్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చే సుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సాయి, వంశీ అనే యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల నుంచి 2.6కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసు లో సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వరంజోన్ ఎస్‌వోటీ పోలీసులు ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబా ద్ కమిషనరేట్ పరిధిలోని వారాసిగూడ వద్ద 7.5కిలోల గంజాయి సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు.

ఒడిశా రాయగడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. శంషాబాద్ పరిధిలో శనివారం ద్విచ్రవాహనంపై 2.70 కిలోల గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి సహా, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. మూడ్రోజుల క్రితం ఫిలింనగర్‌లోని పబ్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారం రా వడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దాడులు చేసి నిందితుడిని పట్టు కున్నారు. బెంగళూరుకి చెందిన ఆ వ్యక్తి పేరు బాబు కిరణ్‌గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న అతడ్ని పబ్ పార్కింగ్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. శనివారం డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక యువతితో పాటు మరో యువకుడిని షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 11గ్రాముల ఎండిఎంఎ, రెండు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. యాదగిరిగుట్ట ఆలేరు ప్రాంతానికి చెందిన కొండెం ప్రియాంక రెడ్డి అలియాస్ ప్రియా(29) ఆర్క్‌టెక్చర్‌గా పని చేస్తున్నారు. వృత్తిపరంగా నగరానికి వలసొచ్చి, మాదాపూర్, సిలికాన్ వ్యాలీ ప్రాంతంలోని న్యూ పాష్‌ప్లేస్ గరల్స్ హాస్టల్‌లో ఉంటుంది. ఆమె డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది.
పటిష్ట నిఘా మధ్య న్యూ ఇయర్ వేడుకలు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ సరఫరాపై పో లీసులు పటిష్ట నిఘా ఉంచారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వ చ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ సేవిస్తే గు ర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. ఆదివారం రాత్రి 8గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వ హించారు. 120 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. అటు, పబ్‌లు, హోటళ్లు, ఈవెంట్స్ నిర్వాహకుల కు కఠిన నిబంధనలు విధించారు. మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా తాగని వారిని వెంట తెచ్చుకోవాలని లేకుంటే క్యాబ్స్, ఆటోలను ఆశ్రయించాలని సూచించారు. పబ్ లో ఎక్కడా డార్క్ ఏరియా, అన్ కవర్డ్ ఏరియా ఉండకూడదని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎవరైనా మద్యం సేవించి వారి కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపితే ఇబ్బందులు తప్పవని మందుబాబులను పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని u/s 185 డిడి కేసులు బుక్ చేసి, కోర్టులో హాజరుపరుస్తారు. మొదటి నేరానికి జరిమానా రూ. 10,000 లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. రెం డోసారి లేక అంతకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే రూ. 15000 లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. మోటారు వాహనాల చట్టం, 1988లో ని సెక్షన్ 19 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకుని సంబంధిత ఆర్‌టిఒలకు అప్పగిస్తారు. మొదటి నేరానికి డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. రెండోసారి లేక అంతకంటే ఎక్కువ సార్లు ఈ నేరానికి పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు అవుతుంది.

ఆ వ్యక్తి భారతదేశంలో డ్రైవింగ్ చేయడానికి అనర్హులుగా ప్రకటి స్తారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎవరైనా రోడ్డు ప్రమాదానికి పాల్పడి, వ్యక్తి మరణానికి కారణమైనట్లయితే, ఐపిపిలోని U/s 304 పార్ట్-II క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని మందుబాబులను పోలీసులు హెచ్చరించారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల మూసివేత టైమును పెంచారు. అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని చెప్పారు. బార్లు, క్లబ్బు లు, పర్మిషన్‌తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి 1గంట వర కు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తారు.
మందుబాబులకు ప్రభుత్వం ఓ వైపు గుడ్‌న్యూస్ చెబుతునూ మరోవైపు రూల్స్ అతిక్రమిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News