Monday, January 20, 2025

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం

- Advertisement -
- Advertisement -
కెపి చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
12 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకారం
ఇద్దరు హీరోయిన్లతో వందలాది కాల్స్
తెరపైకి బిగ్‌బాస్ నటి పేరు

హైదరాబాద్ : టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయిన కబాలి నిర్మాత కెపి చౌదరిని రెండ్రోజులు విచారణ అనంతరం కస్టడీ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను ప్రస్తావించారు. సెలబ్రెటీలు, నేతల కుమారులకు కెపి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు పేర్కొన్నారు. కెపి కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేస్తుండటంతో పలువురి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. సినీ నటి ఆషురెడ్డి, మరో ఆర్టిస్టుతో అతను వందలాది కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లతోనూ కెపి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒకరు తెలుగు బిగ్‌బాస్‌లో నటించిన హీరోయినైతే, మరొకరు ఐటెం సాంగ్స్ చేసే నటిగా సమాచారం.

కెపి కాల్ లిస్ట్‌లో రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్, సుశాంత్ సాయిప్రసన్న, రాకేష్ రోషన్, రతన్‌రెడ్డి , ఒంటేరు పనవ్‌రెడ్డి, అనురూప్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో 12 మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కెపి ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో అతని బ్యాంక్ లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా 11 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు తెలిసింది. అయితే విచారణకు ముందు కెపి చౌదరి వాదన మరోలా ఉంది తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, సెలబ్రిటీలు ఎవరికీ నేను డ్రగ్స్ అందించ లేదన్నారు. ఫోన్‌లో నెంబర్లు ఉన్నంత మాత్రాన డ్రగ్స్ అమ్మినట్టా? అని ప్రశ్నించారు. నేను డ్రగ్స్ తీసుకుంటా అవి నాకోసమే తప్ప అమ్మడానికి కాదని వివరణ కెపి చౌదరి వివరణ ఇవ్వడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News