Friday, November 22, 2024

రూ.20 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం రూ.20 లక్షల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నరారు. కామారెడ్డి పట్టణంలోనే ఇంటర్నేషనల్ హోటల్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. తనిఖీ సమయంలో కారులో వెళ్తున్న ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉన్న తనిఖీ చేయగా ఆ వ్యక్తి బ్యాగ్‌లో రెండు కేజీల అల్ఫాజోలం అనే మాదకద్రవ్యం లభించింది. సదరు వ్యక్తిని విచారించగా తన పేరు భవానీసింగ్, అని, రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా, లాడ్ను గ్రామవాసిగా తెలిపాడు. అల్ఫాజోలంను కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తారని తెలిపాడు. దీనిని రాజస్థాన్‌లోని ముఖేష్ సింగ్ అనే వ్యక్తి నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన

సుదర్శన్ అనే వ్యక్తికి విక్రయించేందుకు తీసుకువెళ్తున్నట్టు తెలిపాడు. తనిఖీ సమయంలో సుదర్శన్ అనే వ్యక్తి కారు వదిలి పరారీ అయ్యాడు. దీంతో కారును, 20 లక్షల వరకు విలువ గల 2 కేజీల అల్ఫాజోలం మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి కార్యాచరణ నిమిత్తం కామారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పజెబుతామని తెలిపారు. ఈ దాడుల్లో నిజామాబాద్ ప్రొహిబిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు డి. చంద్రభాను,, పిఅండ్‌ఇఐలు చారి, సిబ్బంది రాజన్న హమీద్, ఉత్తమం, శివ, విష్ణు, అవినాష్, గంగారాం, లక్ష్మణ్ పాల్గ్గొన్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News