Friday, February 7, 2025

నవీ ముంబలో రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..

- Advertisement -
- Advertisement -

ముంబై: నవీ ముంబలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్ సిండికేట్‌ గుట్టు రట్టు చేసింది. శుక్రవారం అధికారులు దాడులు చేసిన దాదాపు రూ.200 కోట్ల విలువైన వివిధ నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. విదేశాలలో ఉన్న ఓ బృందం ఈ సిండికేట్‌ను నిర్వహిస్తున్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న కొన్ని మాదకద్రవ్యాలను కొరియర్, చిన్న కార్గో సేవల ద్వారా అమెరికా నుండి నిందితులు ఇక్కడికి తరలించినట్లు తెలిపారు.

గత నెలలో ఆస్ట్రేలియాకు పంపాల్సిన పార్శిల్ నుండి 200 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, నవీ ముంబైకి డ్రగ్ మూలాన్ని ట్రాక్ చేయడం ద్వారా సిండికేట్‌ను ఛేదించామని అధికారి వెల్లడించారు.గత వారం నవీ ముంబై నుండి 11.54 కిలోల కొకైన్, హైడ్రోపోనిక్ కలుపు 200 ప్యాకెట్ల(5.5 కిలోలు)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News