Monday, January 20, 2025

పట్టుబడ్డ 160 మంది మందుబాబులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః నగర ట్రాఫిక్ పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రండ్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 160మందిని పట్టుకుని వారిని కోర్టులో హాజరుపర్చారు. ఇందులో 25మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఎంవిఐ యాక్ట్ ఉల్లంఘించిన ఏడుగురికి సోషల్ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది. ముగ్గురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.

ఈ సందర్భంగా డిసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో డిడి కేసుల్లో పట్టుబడిన వారు కోర్టుకు హాజరుకావడంలేదని తెలిపారు. వారి వాహనాలను పోలీస్ స్టేషన్లలో భద్రంగా ఉంచామని తెలిపారు. ఇలా కోర్టుకు హాజరు కాని వారికి ఇప్పటి వరకు మూడు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులకు స్పందించని వారి వాహనాలను వేలం వేస్తామని స్పష్టం చేశారు. వాహనాల యజమానులు తమ వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లను చూపించి వాహనాలను తీసుకుని వెళ్లాలని కోరారు. కొందరు వాహనాలను యజమానులు లైసెన్సులను రిన్యూవల్ చేసుకోలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News