Friday, November 22, 2024

తప్పతాగి పోలీసులకు చిక్కారు…..

- Advertisement -
- Advertisement -

భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
నూతన సంవత్సర వేడుకల్లో నమోదు
సైబరాబాద్‌లో అత్యధికం

Drunk and drive in Hyderabad

మన తెలంగాణ/సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల్లో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఆదేశించినా కూ డా ఎవరూ వినలేదు. యువకులు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడంతో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డారు. ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి పట్టుబడ్డ వారిపై 1,258 కేసులు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,528 కేసులు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు పోలీసులు నమోదు చేశారు. పోలీసులు నిర్ధేశించిన మోతాదుకు మించి మద్యం తా గి వాహనాలు నడిపిన వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 265 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం తాగి రోడ్డు ప్రమాదాలు చేసిన వారి సంఖ్య తగ్గింది.
గాంధీనగర్‌లో గొడవ…
నూతన సంవత్సర వేడుకల్లో పాత కక్షలతో యువకులు గొడవపడ్డారు. ఈ కేసులో 15మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల మధ్య గొడవ జరుగుతుండడంతో దానిని ఆపేందుకు వెళ్లిన శివప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గా యాలు అయ్యాయి. దాడి చేసిన వినయ్‌కుమార్, శ్రీనివాస్, జస్వంత్‌తోపాటు 15మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి కారును నడిపి అదుపుతప్పి ప్రహరిని ఢీకొట్టడంతో శశాంక్ శేఖర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
పోలీసులపై యువతి వీరంగం….
డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై మహారాష్ట్రకు చెందిన యువతి చిందులు వే సింది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన యువతి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్ల దురుసుగా ప్రవర్తించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బంజారాహిల్స్ పోలీసులపై దుర్భాషలాడింది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అటువైపుగా వచ్చి ముంబాయికి చెందిన యువతి, మరికొందరు వాహనాల్లో వచ్చారు. కారును ఆపిన పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు చేస్తున్న పోలీసులను దూ షించింది. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో పోలీసులు యువతితోపాటు ఆమెతో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఉన్న వారు యు వతికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా యువతి ఎవరిమాటా వినలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News