న్యూఢిల్లీ: మిన్నెసోటా నుండి అలస్కా వెళుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో తాగిన మత్తులో ఓ సీనియర్ ప్రయాణికుడు ఒక మగ విమాన సహాయకుడిని(అటెండెంట్) పట్టుకుని, మెడపై బలంగా ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. తర్వాత కెప్టెన్ మీల్ ట్రేను పగులగొట్టాడు. ఆ వృద్ధుడిని అమెరికా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. 61 ఏళ్ల ఆ వృద్ధుడిని డేవిడ్ అలాన్ బర్క్‌గా గుర్తించారు. టిసి(క్రూ మెంబర్)పట్ల లైంగికంగా వ్యవహరించినందుకు అతడిని అరెస్టు చేశారు.
ఆ ఫ్లయిట్ అటెండెంట్ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సీటు నెం. 5ఏలో కూర్చున్నాడు. సాధారణంగా ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు విమానం టేకాఫ్ చేయడానికి ముందు ఫ్లయిట్ అటెండెంట్ నుంచి డ్రింక్స్ స్వీకరిస్తారు. ఫ్లయిట్ అటెండెంట్‌తో తప్పుగా వ్యవహరించిన కేసులో ఈ సీనియర్ సిటిజెన్ ఏప్రిల్ 27న విచారణను ఎదుర్కొననున్నాడు.