Monday, January 20, 2025

ముగ్గురు పిల్లలను నరికి చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

Drunk Father Kills 3 Children in Sundargarh

సుందర్ గఢ్: ఒడిశా రాష్ట్రం సుందర్ గఢ్ జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను కన్నతండ్రి చంపేశాడు. నిందితుడిని పాండుగా గుర్తించారు. మద్యం మత్తులో గొడ్డలితో నరికి హత్యచేసినట్టు స్థానికులు తెలిపారు. పిల్లల మృతదేహాలను సమీపంలోని బావిలో పడేశాడు. తొలత భార్యను చంపేందుకు ప్రయత్నించిన నిందితుడు. ఇంటి నుంచి ఆమె పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పాండు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News