Thursday, January 23, 2025

లవర్‌తో ఫైటింగ్.. ఫుల్‌గా తాగి ట్రాఫిక్‌లో హంగామా (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్: గ్వాలియర్‌లోని ఫూల్‌బాగ్ సిగ్నల్ వద్ద మద్యం తాగిన యువతి కదులుతున్న కారులో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారి సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది. ఆమె రద్దీగా ఉండే రోడ్డుపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బాటసారులను బెదిరించడం కూడా ఫుటేజీలో కనిపిస్తోంది. ఒక ప్రయాణీకుడి స్కూటర్‌ను ఆపిన యువతి, అతనిని కిందికి దిగమని ఆదేశించి, దానిని స్వయంగా నడపడం ప్రారంభించినప్పుడు పరిస్థితి తీవ్రమైంది. తర్వాత, ఆమె కదులుతున్న కారు బానెట్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆమె తన ప్రియుడితో గొడవకు దిగినట్లు సమాచారం. దాదాపు అరగంట పాటు ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఎట్టకేలకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News