Thursday, January 23, 2025

విమానంలో ఇటలీ మహిళ హంగామా.. అర్ధనగ్నంగా నిరసన

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అబూ దాబి నుంచి ముంబై వస్తున్న ఎయిర్ విస్టారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక ఇటలీ మహిళ అలజడి సృష్టించింది. విమాన సిబ్బందిపై చేయి చేసుకున్న ఆ మహిళ అర్థనగ్న దుస్తులతో నిరసన ప్రదర్శించింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఆ మహిళను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. పోలా పెరుషియో అనే ఇటలీ మహిళ ఎకానమీ టిక్కెట్‌పై ప్రయాణించవలసి ఉండగా తాను బిజినెస్ క్లాట్‌లో కూర్చుంటానని పట్టుపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అందుకు విమాన సిబ్బంది నిరాకరించడంతో ఆమె తన దుస్తులలో కొన్నిటిని విప్పేసి అర్ధనగ్నంగా విమానంలో నడుస్తూ నిరసన తెలిపింది. ఎయిర్ విస్టారాకు చెందిన సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సహార్ విమానాశ్రయ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున 2.03 గంటలకు అబూ దాబిలో బయల్దేరిన విమానం ముంబైలో తెల్లవారుజామున ల్యాండ్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News