Sunday, January 5, 2025

అత్తాపూర్ లో దారుణ.. మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ లో దారుణ ఘటన జరిగింది. అర్థరాత్రి మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News