Monday, December 23, 2024

బొమ్మ అనుకుని బాలుడిపై పంచ్ విసిరాడు! (వీడియో)

- Advertisement -
- Advertisement -

బొమ్మకీ, బాలుడికీ తేడా తెలుసుకోలేని ఓ వ్యక్తి బాలుడిపై దాడి చేసి, ఆ బాలుడి తండ్రి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. అసలు విషయం ఏమిటంటే… రష్యాలోని కుర్చటోవ్ అనే పట్టణంలోని ఓ సూపర్ బజార్ లో 55 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఓ నాలుగేళ్ల బాలుడి మొహంపై పిడిగుద్దు గుద్దాడు. దాంతో ఆ బాలుడు కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ఆ అబ్బాయి తండ్రి.. తన కొడుకుని కొట్టినవాణ్ని చావబాదాడు.

చిన్నపిల్లాడని కూడా చూడకుండా ఎందుకు కొట్టావయ్యా అని ఆ వ్యక్తిని అడిగితే అతను చెప్పిన సమాధానం విని అంతా విస్తుపోయారు. అతను ఏం చెప్పాడంటే… ‘సూపర్ బజార్ లో అక్కడకక్కడ బొమ్మలు నిలబెడతారు కదా .. ఆ అబ్బాయిని కూడా బొమ్మే అనుకుని ఓ గుద్దు గుద్దాను’ అని.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News