Sunday, December 22, 2024

మద్యం మత్తులో తల్లిపై కొడుకు దాడి (వీడియో)

- Advertisement -
- Advertisement -

Drunk man brutally thrashing mother in AP

యానాం: డబ్బుల కోసం మద్యం మత్తులో ఓ వ్యక్తి కనికరం లేకుండా తన తల్లిని దారుణంగా కొట్టిన సంఘటన కాకినాడ జిల్లాలో జరగ్గా, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన లక్ష్మి(75)కి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమెకు రూ.2,500 పింఛను వస్తుండగా, రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. వీరిలో ఒకరైన టి వెంకన్న మద్యానికి బానిసై పింఛన్ డబ్బుల కోసం తల్లిని వేధిస్తున్నాడు. ఆదివారం ఉదయం తల్లిని కొట్టి కాలుతో గొంతు నొక్కాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ఇరుగుపొరుగు వారు యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెదడులో అంతర్గత రక్తస్రావం అయిందని, స్పందించలేదని వైద్యులు తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News