Sunday, January 19, 2025

కిక్కెక్కువైతే గిట్లనే ఉంటది.. వైరల్ అయితున్న మందుబాబు వీడియో

- Advertisement -
- Advertisement -

మందేస్తే మైండ్ ఏమ్ చేస్తోందో ఎవరికి తెలియదు. ఒకడు తాగి అక్కడే పడిపోతే.. మరి కొందరూ పక్కవాళ్లను పట్టుకుని దిమాక్ ఖరాబ్ చేస్తారు. అట్లాంటి ముచ్చటోకటి ఇది. ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి చేసిన పని అత్యవసర సేవలకు విధులు నిర్వహించే అంబులెన్స్ సిబ్బందికి పిచ్చెక్కించింది. రమేష్ అనే వ్యక్తి మస్త్ తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుసుడు మొదలుపెట్టిండు. అట్ల పోతుపోతూ అంబులెన్స్‌కు ఫోన్ చేసిండు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతన్ని చూసి అవాక్కైయ్యారు. ఎందుకు ఫోన్ చేసినవని అడిగితే నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవ్వు, నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహతప్పి పడిపోతానేమో అంటూ అంబులెన్స్ సిబ్బందితో వాదించాడు. నన్ను జనగాంలో దింపండి అంటూ పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News