Monday, December 23, 2024

సీటు బెల్టు ఉండగానే ఫ్రెండ్ ని తోసేసిన రాక్షసులు.. 25కిమీ ఈడ్చుకుపోయిన కారు

- Advertisement -
- Advertisement -

స్నేహితులు కాదు వారు.. రాక్షసులు. తాగిన మైకంలో స్నేహితుడని కూడా చూడకుండా కార్లోంచి తోసేశారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్న ఆ స్నేహితుడు రక్షించమంటూ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా పాతిక కిలోమీటర్లు ఈడ్చుకువెళ్లారు. దాంతో తల చితికిపోయి, కాళ్లూ చేతులూ విరిగి ఆ స్నేహితుడు మరణించాడు. మానవత్వానికే కళంకం తెచ్చే ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్- గ్వాలియర్ హైవేపై జరిగింది.

రాజేశ్ చద్దర్, సందీప్, సంజీవ్ నక్వల్ అనే ముగ్గురు స్నేహితులు తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లి కారులో తిరుగు ప్రయాణమయ్యారు.  ముగ్గురూ దారిలో పూటుగా తాగారు. రాజేశ్ కారు నడుపుతున్నాడు. దారిలో మాటామాటా పెరగడంతో సందీప్ ను అకస్మాత్తుగా కార్లోంచి తోసేశారు. అతను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో కిందపడిపోలేదు. కారు డోరుకీ, రోడ్డుకీ మధ్య వేళ్లాడుతూ కేకలు వేయసాగాడు. అయితే తాగిన మైకంలో ఉన్న రాజేశ్, సంజీవ్ పట్టించుకోలేదు. స్థానికులు గమనించి పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు వారి కారును అటకాయించారు. అప్పటికే సందీప్ మరణించాడు. అతని తల రోడ్డుకు కొట్టుకుని ఛిద్రమైపోయింది. కాళ్లూచేతులూ విరిగిపోయాయి. పోలీసులు సైతం అతని మృతదేహాన్ని చూడలేకపోయారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

సందీప్ ను తోసేశాక కారు వంద కిలోమీటర్ల స్పీడులో దూసుకుపోయిందనీ, కొందరు మోటర్ సైక్లిస్టులు చూసి, డ్రైవర్ రాజేశ్ ను అప్రమత్తం చేసినా, తాగిన మైకంలో పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రాజేశ్, సంజీవ్ లను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News