Wednesday, January 22, 2025

విమానంలో తాగుబోతు ప్రయాణికుని నిర్వాకం

- Advertisement -
- Advertisement -

టోక్యో : జపాన్ నుంచి అమెరికాకు బయలుదేరిన విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బంది చేతిని కొరికాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం 159 మంది ప్రయాణికులతో జపాన్ నుంచి అమెరికాకు బయలుదేరిన ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఈ సంఘటన జరిగింది. మద్యం ఎక్కువగా సేవించిన 55 ఏళ్ల ప్రయాణికుని వికృత చేష్టలకు తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానం పసిఫిక్ మహా సముద్రంపై నుంచి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పైలట్‌కు ఈ విషయం తెలియగానే విమానాన్ని తిరిగి జపాన్‌కు మళ్లించి నిందితుడిని పోలీస్‌లకు అప్పగించారు. పోలీస్‌లు ఆ ప్రయాణికుడిని విచారించగా, తనకేదీ గుర్తు లేదంటూ సమాధానం ఇచ్చినట్టు ఎయిర్‌వేస్ ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News