Sunday, November 24, 2024

విమాన అటెండెంట్‌కు ముద్దు.. వృద్ధుడిపై కేసు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: విమాన ప్రయాణంలో కొందరు ప్రయాణికులు అసభకరంగాప్రవర్తిస్తూ సహ ప్రయాణికులనే కాక విమాన సిబ్బందిని సైతం ఇబ్బందిపెడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో తరచు చోటుచేసుకుంటున్నాయి. మద్యం తాగి దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులు కొందరైతే సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ప్రబుద్ధులు మరికొందరి ఉదంతాలు ఇటీవల వెలుగు చూశాయి. అలాంటిదే మరో సంఘటన తాజాగా బయటకు వచ్చింది. మెన్నసోటా నుంచి అలాస్కా వెళుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో మద్యం మత్తులో ఒక 61 ఏళ్ల వ్యక్తి విమానం అటెండెంట్‌ను బలవంతంగా ముద్దు పెట్టిన సంఘటన సంభవించింది. డేవిడ్ అలాన్ బర్క్ అనే ఆ వృద్ధుడు ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తుండడంతో అతడికి విమానంలో మద్యం పుచ్చుకోవడానికి సిబ్బంది అనుమతించారు. ఫుల్లుగా మందు కొటిన ఆ వ్యక్తి అటుగా వెళుతున్న అమగ అటెండెంట్‌ను ఆపాడు.

Also Read: చీర కోసం షాపింగ్ మాల్‌లో మహిళల ఫైటింగ్.. వీడియో వైరల్

నీ సరీస్ బాగుందంటూ ముద్దు పెట్టుకోవడానికి అనుమతి కోరారు. అటెండెంట్ అందుకు ఒప్పుకోకపోవడంతో బర్క్ అతడిని పట్టుకుని బలంతంగా మెడ మీద ముద్దు పెట్టేశాడు. దీంతో ఆ అటెండెంట్ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ విమానం పైలట్‌కు ఫిర్యాదు చేశాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే బర్క్‌ను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి అప్పగించారు. తాను ఏ తప్పు చేయలేదని ఆ 61 ఏళ్ల వృద్ధుడు లబోదిబో అంటూ మొత్తుకున్నా అతడిని అరెస్టు చేసిన సెక్యూరిటీ సిబ్బంది అతడిపై కేసు నమోదు చేశారు. దాడి, నేరపూరిత దురుసు ప్రవర్తన కింద ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఏప్పిల్ 27న కోర్టులో బర్క్ హాజరుకావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News