Monday, December 23, 2024

విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఇండిగో విమానంలో శుక్రవారం బయలు దేరిన 40 ఏళ్ల ప్రతీక్ మద్యం మత్తులో అత్యవసర ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన సిబ్బంది కెప్టెన్‌ను అప్రమత్తం చేశారు. ప్రయాణికుడిని అడ్డుకుని హెచ్చరించారు. దీంతో ప్రమాదం తప్పింది.

విమానం కర్ణాటకలో ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని సిఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతంలో ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానంలో కూడా ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ కవర్ తీసివేయడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News