Saturday, November 16, 2024

తాగిన మైకంలో ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రవిసర్జన

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఒక ప్రయాణికుడు సహ ప్రయాణికురాలైన ఒక 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేసిన సంఘటన నవంబర్ 26న జరుగగా పది రోజులకే ఇలాంటిదే మరో సంఘటన జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 6వ తేదీన పారిస్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా టి 142 విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మద్యం కైపులో తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. దీనిపై బాధిత ప్రయాణికురాలు ఎయిర్ ఇండియా అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ నీచమైన చర్యకు పాల్పడిన ప్రయాణికుడు మాత్రం లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో ఎయిర్ ఇండియా అధికారులు కఠిన చర్యలు తీసుకోకుండా విచిచిపెట్టారు.

సహ ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జనకు పాల్పడిన ప్రయాణికుడి గురించి విమానం పైలట్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియచేయగా మద్యం మత్తులో ఉన ఆ ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారని విమానాశ్రయ అధికారులు గురువారం తెలిపారు. ఆ ప్రయాణికులు ఏ తరగతిలో ప్రయాణిస్తున్నదీ తెలియరాలేదు. ఉదయం 9.40 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బంది ఆదేశాలను పాటించకుండా ఒక మహిళా ప్రయాణికురాలికి చెందిన దుప్పటిపై మూత్రవిసర్జన చేసినట్లు ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి విమానాశ్రయ అధికారులు తెలియచేశారు. సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే సంబంధిత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పిన తర్వాత ఇద్దరు ప్రయాణికులు రాజీకి రావడంతో వారిని వదిలివేసినట్లు అధికారులు తెలిపారు. మొదట్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఆ మహిళా ప్రయాణికురాలు పోలీసుల వద్ద కేసు నమోదు చేయడానికి నిరాకరించినట్లు వారు తెలిపారు. అనంతరం..ఆ ప్రయాణికుడిని పంపించి వేసినట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News