Monday, December 23, 2024

దుబాయ్ విమానం ఎక్కాల్సినోడు.. తాగి బుక్కయ్యాడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మరికాసేపట్లో దుబాయ్ విమానం ఎక్కాల్సిన ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో విమానాశ్రయంలోని డిపార్చర్ గేటు వద్ద మూత్ర విసర్జన చేసి కటకటాలపాలయ్యాడు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ 3 కు చెందిన డిపార్చర్ ప్రాంతంలో జనవరి 8న ఈ సంఘటన జరిగింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో డిపార్చర్ ఏరియాకు చెందిన 6వ నంబర్ గేట్ సమీపంలో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు సిఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ఫోన్ వచ్చింది.

వెంటనే వారు అక్కడకు చేరుకుని మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మద్యం సేవించినట్లు సిబ్బంది గుర్తించారు. నిందితుడిని బీహార్‌కు చెదిన జోహార్ అలీ ఖాన్(39)గా గుర్తించారు. అతను దుబాయ్ విమానం ఎక్కేందుకు విమానాశ్రయం వచ్చాడు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయరాదని తోటి ప్రయాణికులు చెప్పినప్పటికీ అతను వినలేదని, పైపెచ్చు వారితో వాగ్వివాదం చేశాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News