Monday, December 23, 2024

తల్లిని కొట్టిన తాగుబోతు కొడుకును పెట్రోల్ పోసి తగలబెట్టిన తండ్రి

- Advertisement -
- Advertisement -

చిక్కబళ్లాపూర: మద్యం మత్తులో తల్లిపై చేయిచేసుకున్న కుమారుడిని సొంత తండ్రే పెట్రోల్ పోసి తగలబెట్టిన విషాదకర ఘటన కర్నాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా వనిగరహళ్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఆదర్శ అనే 28 ఏళ్ల యువకుడు రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. తండ్రి జయరామయ్య(58) ఎన్నిసార్లు నచ్చచెప్పినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. శుక్రవారం రాత్రి ఆదర్శ మద్యం కోసం తల్లిని డబ్బు అడిగాడు. తల్లి తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఆమెపై అతను చేయిచేసుకున్నాడు. ఇది చూసి సహించలేక తండ్రి అతడిని కొట్టాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు ఆదర్శ కుప్పకూలిపోయాడు. తండ్రికి కోపం చల్లారక అతడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మంటల్లో ఆదర్శ సజీవదహనమయ్యాడు. తరువాత జయరామయ్య పోలీసులకు విషయం చెప్పి లొంగిపోయాడు. దొడ్డబెలవంగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News