- Advertisement -
హైదరాబాద్: నాచారం పరిధిలోని వైన్స్ షాప్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. కనకదుర్గ వైన్స్ లో మద్యం తాగడానికి వచ్చిన నాగి అనే వ్యక్తి అక్కడే అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో వైన్స్ షాప్ సిబ్బంది నాగి కాళ్లు, చేతులు పట్టి రహదారి ఫుట్ పాత్ పై పడేశారు. అయితే, అపస్మారకస్థితిలోకి వెళ్లిన నాగి ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో నాగి మృతదేహంతో బంధువులు వైన్స్ షాప్ ముందు ఆందోళనకు దిగారు. నాగి మృతికి వైన్స్ షాప్ సిబ్బంది, యజమానే కారణమంటూ వారు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -