Wednesday, January 22, 2025

112కు ఫోన్ చేసి ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ముంబయి: మద్యం మత్తులో ఓ వ్యక్తి 112కు ఫోన్ చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను చంపేస్తామని బెదిరించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పుణే నుంచి మద్యం ప్రియుడు 112కు ఫోన్ చేసి అంబులెన్స్ కావాలన్నాడు. లిఫ్ట్ చేసిన ఆపరేటర్ 108కు ఫోన్ చేయాలని సూచించాడు. వెంటనే అసభ్యంగా తిట్టడంతో పాటు సిఎం ఏక్‌నాథ్ షిండేను చంపేస్తామని బెదిరించాడు. వెంటనే అతడి భార్య ఫోన్ తీసుకొని…. తన భర్త తాగిన మైకంలో ఉన్నాడని, అతడు ఏం మాట్లాడుతున్నాడో అతడికే అర్థం కావడం లేదని వివరణ ఇచ్చింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News