Thursday, January 9, 2025

బంజారాహిల్స్‌లో మందుబాబుల హల్‌చల్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేస్తు పట్టుబడిన మందుబాబులు మంగళవారం రాత్రి హల్‌చల్ చేశారు. రోడ్డుపై వాహనాలను ఆపి, రోడ్డుపై కూర్చుని హంగామా చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు పార్క్‌హయత్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగిన యువకులు కారు నడుపుకుంటు రాగా పోలీసులు ఆపారు. కారు పత్రాలు చూపించాలని అడగడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా వాహనాలను ఆపుతూ నానా హంగామా చేశారు. ఎపిలోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును ఆపి లోపల ఉన్న వారిని బయటకు దించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. మందుబాబులు దాదాపు మూడు గంటలపాటు హల్ చల్ చేశారు. అదే సమయంలో హిజ్రా కూడా హంగామా చేయడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Drunkers Hulchul at midnight in Banjara Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News