Monday, December 23, 2024

దృశ్యం సినిమా… కుమారుడిని చంపి… పోలీసులకు చుక్కలు చూపించిన తల్లి

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: దృశ్యం సినిమా చూసి తన ప్రియుడి కోరిక మేరకు రెండున్నర ఏళ్ల కుమారుడిని తల్లి చంపి సెప్టింక్ ట్యాంక్‌లో పడేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నయనా మండవి అనే మహిళ సూరత్‌లోని దిండోలి ప్రాంతంలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తున్నారు. అదే భవనంలో తన కుమారుడు వీర్ మండవితో కలిసి ఆమె ఉంటుంది. తన కుమారుడు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా విచారణ చేసిన పురోగతి కనిపించలేదు.

Also Read: ఖమ్మం సభకు జనాన్ని రాకుండా ఆపడం మంచి పద్ధతి కాదు: కోమటి రెడ్డి

 

నయనా మండవిని పలుమార్ల ప్రశ్నించిన కూడా ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆమెకు ప్రియుడు ఉండడంతో అతడు కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు భావించారు. ఝార్ఖండ్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన కూడా ఎలాంటి సమాచారం రాలేదు. ఫోన్‌ను ట్రేస్ చేసిన కూడా సూరత్ వచ్చినట్టు సమాచారం రాలేదు. బాలుడి ఆచూకీ గురించి సమాచారం లేకపోవడంతో తల్లిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. తన ప్రియుడు తన కుమారుడు లేకుంటేనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో చంపేశానని తెలిపింది. ఓ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుంత తీసి పాతిపెట్టానని పోలీసులకు చెప్పింది.

దీంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి గుంత తీయగా మృతదేహం కనిపించలేదు. మరోసారి ఆమెను ప్రశ్నించడంతో మృతిదేహాన్ని చెరువులో పడేశానని పేర్కొంది. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం కనిపించలేదు. పోలీసులు గట్టిగా ఆమెను నిలదీయడంతో తాను పని చేస్తున్న నిర్మాణంలో ఉన్న భవనంలో సెప్టింక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పడేశానని తెలిపింది. పోలీసులు సెప్టింక్ ట్యాంక్‌లో నుంచి మృతదేహాన్ని తీసి శవ పరీక్ష నిమిత్తం సూరత్ ప్రభుతాస్పత్రికి తరలించారు. మృతదేహం గురించి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించడంతో ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. దృశ్యం సినిమాను చూసి తన కుమారుడిని చంపేసి సెప్టింక్ ట్యాంక్‌లో పడేశానని వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News