Monday, December 2, 2024

ఈ డ్రై ఫ్రూట్స్‌ని తింటే అనేక ప్రయోజనాలు..

- Advertisement -
- Advertisement -

శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, విటమిన్ డి, కాల్షియం లోపాన్ని తీర్చే వాటిని తీసుకోవాలి. ఇందులో భాగంగానే ఆహారంలో ఖర్జూరాన్ని తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోండి. అనేక పోషకాలతో కూడిన ఈ డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో ఖర్జూరం తినడం చాలా మంచిది. ఖర్జూరంలో చాలా ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరానికి పవర్‌హౌస్‌లు లాంటివి. శీతాకాలపు ఆహారంలో వీటిని ఎందుకు చేర్చుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

చలికాలంలో చాలా మంది చర్మం పొడిబారడం, నిర్జీవమైన చర్మం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో చర్మ సంరక్షణ కోసం ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోండి. ఖర్జూరంలో ఉండే విటమిన్లు చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా.. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. ఖర్జూరంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ముఖ్యంగా.. చలికాలంలో శారీరక శ్రమ తగ్గినప్పుడు, జీర్ణ సమస్యలు సంభవించినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అంతేకాకుండా.. బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు చలికాలంలో తరచుగా జలుబు, ఫ్లూ వైరస్‌లకు గురవుతారు. అలాంటి వారు ఆహారంలో ఈ డ్రై ఫ్రూట్‌ని చేర్చుకోవడం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అద్భుతంగా పని చేస్తాయి. రక్తపోటును నియంత్రించడానికి, సరైన గుండె ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం ఉన్నందున ఖర్జూరం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News