Thursday, January 23, 2025

పౌర కమిషనర్‌గా డిఎస్. చౌహాన్

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ ఇ.శ్రీధర్
రవాణాకు జ్యోతిబుద్ధ ప్రకాశ్
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి
రంగారెడ్డి కలెక్టర్ మార్పు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆరుగురు ఐఎఎస్‌లు, ఒక ఐపిఎస్ అధికారిని బదిలీచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఆయన స్థానంలో కమిషనర్‌గా ఇ. శ్రీధర్‌ను నియమించారు. ఆయనకు టిఎస్‌ఐఐసి ఎండిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఇ.వి. నర్సింహారెడ్డిలను నియమించారు. పౌర సరఫరాల కమిషనర్‌గా వెయిటింగ్‌లో ఉన్న ఐపిఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌ హాన్‌ను నియమించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా జిఎడిలో రిపోర్ట్ చే యాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా నూతన క లెక్టర్‌గా గౌతమ్ పొట్రును నియమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News