Thursday, January 23, 2025

నూతన డిజిపిని కలిసిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా నియమితులైన రవిగుప్తాను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ సోమవారం కలిశారు. డిజిపిగా నియామకమైనందుకు రవిగుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డిజిపిగా ఉన్న అంజనీకుమార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడకముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఓ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ను కలడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కిందకు వస్తుందని దానిని ఉల్లంఘించిన అంజనీకుమార్‌ను సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ శాంతికుమారికి ఉత్తర్వులు పంపింది. కొత్త డిజిపి నియామకానికి ముగ్గురి పేర్లు పంపించాల్సిందిగా కోరగా ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు పంపించారు. దానిలో నుంచి రవిగుప్తాను కొత్త డిజిపిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News