Friday, April 4, 2025

రాచకొండ పోలీసుల ఐపిఎల్ నిర్వహణ భేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాచకొండ పోలీసులు ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించారని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ సన్‌రైజర్స్ ప్రతినిధి బృందం రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్‌ను శనివారం నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో శనివారం కలిశారు. ఈ సందర్భంగా సిపి డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు చేయడం ఎన్నో సవాళ్లతో కూడినదని అన్నారు.

కానీ సివిల్, ట్రాఫిక్ పోలీసులు కలిసి పనిచేయడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండానే విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రత్యేక నిఘా బృందాల ద్వారా నకిలీ టిక్కెట్లు విక్రయించేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకున్నామని తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డి మహేష్ శరవణన్, సన్‌రైజర్స్ ఆపరేషన్స్, జెమిని కిరణ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News