Sunday, February 2, 2025

చేరిన 24 గంటల్లోనే కాంగ్రెస్‌కు డిఎస్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన డి శ్రీనివాస్ 24 గంటలు కూడా గడవకముందే ఆ పార్టీకి రాజీనామా చేయడం విశేషం. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన డి శ్రీనివాస్ తదనంతరం టిఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి బిజెపి ఎంపిగా కొనసాగుతున్నారు. కాగా..డి శ్రీనివాస్ భార్య ధర్మపురి విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, దయచేసి ఆయనను రాజకీయాలకు వాడుకోవద్దని ఆమె లేఖరలో కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News