Sunday, January 19, 2025

జులై 17 నుంచి 31వరకు డిఎస్‌సి పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం డిఎస్‌సికి ముందు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11, 062 ఉపాధ్యాయ నియామకాలకు గత నెల 29వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్‌సి రాయాలంటే టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిం ది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 3 లక్షలమంది అభ్యర్థులకు ఊరట లభించనుంది. గురువారం విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చే సింది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్న ట్లు టెట్ చైర్మన్ తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10 వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

అదే విధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సీ పరీక్షలను తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. జూలై 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి మెగా డిఎస్‌సి కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత నోటిఫికేషన్ రావడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు సెప్టెంబర్ 5093 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆన్‌లైన్‌లో ద-రఖాస్తులు స్వీరించింది. అప్పట్లో 1.80 లక్షలమంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో డిఎస్‌సి పరీక్షలు వాయిదా వేసింది. దీంతో నిరుద్యోగ అభ్యర్ధుల ఆశలపై నీల్లు చల్లినట్లైంది. ఎన్నికల రాగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మెగా డిఎస్‌సి వేస్తామని ప్రకటించి అధికారం చేపట్టిన మూడు నెలలలోపు 11,062 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ప్రభుత్వ ప్రకటన నిరుద్యోగు ఆశలు రేకెత్తాయి. ఇటీవల అభ్యర్ధులు టెట్ మరోసారి నిర్వహించాలని కోరడంతో విద్యాశాఖ పరీక్షల తేదీలు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. సిఎం రేవంత్‌రెడ్డితోనే నిరుద్యోగ అభ్యర్దులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఓయూ విద్యార్ధి సంఘాల నాయకులు సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News