Tuesday, September 17, 2024

డిఎస్‌సి పరీక్షలు యథాతథం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిఎస్‌సి పరీక్షలు యథాతథంగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డిఎస్‌సి పరీక్షలు జరుగనుండగా, ఈ నెల 11వ తేదీ సాయంత్రం డిఎస్‌సి హాల్ టికెట్లు వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లో డ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవి నరసింహారెడ్డి ప్రకటించారు.

ఇటీవల టెట్ ఫలితాలు విడుదల కాగా,  టెట్‌కు, డిఎస్‌సికి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు ఆశావహులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే సోమవారం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. ఈ నేపథ్యంలోనే డిఎస్‌సి పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంటూ స్పష్టం చేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు
రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్‌సి -2024 పరీక్షలు ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష జరగనున్నది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్‌సి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇటీవల సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు. డిఎస్‌సి 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా…గత నెల 20వ తేదీతో గడువు ముగిసిం ది. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,966 మంది చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News