Wednesday, January 22, 2025

6612 టీచర్ పోస్టులకు డిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:నిరుద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇ ప్పుడు మరో నోటిఫికేషన్‌తో తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెం డో రోజుల్లో షెడ్యూల్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర వి ద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 6,612 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చే యాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో ఉపాధ్యాయ పోస్టులు 5,089 ఉండగా, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉ న్నట్లు మంత్రి వెల్లడించారు. ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేయనున్న నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలకు వెల్లడించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల నుంచి కళాశాలలు, యూనివర్సిటీలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మరోవైపు నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే పలు నోటిఫికేష న్లు జారీ చేశామని.. ఇప్పుడు త్వరలోనే ఉపాధ్యా య పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామని వివరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ను మళ్లీ పాత విధానంలోనే భర్తీ చేయాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 2017లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డిఎస్‌సి) స్థానంలో టిఎస్‌పిఎస్‌సి ద్వారా టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టిఆర్‌టి) నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను భర్తీ చేయగా, ఈసారి గ తంలో మాదిరిగా డిఎస్‌సి ద్వారానే టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కలెక్టర్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుందని, ఇందులో అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖాధికారి కార్యదర్శిగా, జిల్లా పరిషత్ సిఇఒ స భ్యులుగా ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2017లో మొదటిసారి 8, 972 పోస్టుల భర్తీకి టిఆర్‌టి నిర్వహించినట్లు చె ప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉ న్న 5,089 ఉపాధ్యాయ పోస్టులను, స్పెషల్ ఎ డ్యుకేషన్ స్కూళ్లలో  ప్రాథమిక పాఠశాలల్లో 796 పోస్టులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 727 పోస్టులు మొత్తం 1,523 టీచర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపిందని వివరించారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,739, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జిటి) 2,575, లాం గ్వేజ్ పండిట్లు 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పిఇటి) 164 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు.
భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు
నియామకాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చిందని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని, అన్ని స్థా యిల విద్యా సంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 491 లెక్చరర్ పోస్టలు, 24 లైబ్రేరియన్, 54 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్, 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రి య కొనసాగుతోందని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో 247 లెక్చరర్ పోస్టులను, 31 లైబ్రరేరియన్ పోస్టులను, 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీలలో ఖాళీగా 742 ఉన్న పోస్టులను గ్రూప్ 4 ద్వారా భర్తీ చేస్తున్నామని తెలిపారు. సాంకేతిక విద్యాశాఖలో 520 పోస్టులు, కళాశాల విద్యలో 280, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో 3,096 పోస్టులను రెగ్యులరైజ్ చేశామని వెల్లడించారు.
పదోన్నతుల ద్వారా పలు పోస్టులు భర్తీ
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం 1,22,386 మంజూరైన మొత్తం టీచర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదోన్నతుల ద్వా రా 9,979 పోస్టులు నింపుతామని తెలిపారు. ఇఖాళీల్లో 1,947 గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు, 2,162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. అలాగే 5,870 పోస్టులను స్కూల్ అసిస్టెంట్‌లుగా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 475 కెజిబివిల్లో 1,264 టీచర్లను కాంటాక్ట్ పద్దతిలో కొత్తగా నియామకాలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 13న ఇచ్చామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సం బంధించి మరో 20 కెజిబివిలు కూడా ఈ సంవత్సరం నుండి ప్రారంభించుకుంటున్నామని మంత్రి సబిత వివరించారు.
రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కెసిఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు సబ్బండ వర్గాలను ఏకం చేశారని, నేడు ముఖ్యమంత్రి హోదాలో అదే నినాదాన్ని నిజం చేస్తున్నారని అన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టి, మన నీళ్లు మనకు తెచ్చారని చెప్పారు. ఉద్యోగాల ప్రకటనతో నాటి నినాదాన్ని నిజం చేశారని వ్యాఖ్యానించారు. నియామకాల ఉద్యమ ట్యాగ్ లైన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ..ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
విద్యారంగానికి ఏటా పెరుగుతున్న నిధులు
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి ఏటా నిధులు పెరుగుతున్నాయని, ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కో ట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గడిచిన తొమ్మిది సం వత్సరాల్లో విద్యారంగంపై రూ.1,87,269 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. కెజి టు పిజిలో భాగంగా గురుకుల విద్యను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. పాఠశాల విద్యలో అద్భుతమైన మార్పుకు నాంది పలకాలని భావించిన ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో మూడు సంవత్సరాల్లో మూడు దశల్లో 7,289.54 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.
సెప్టెంబరు 15న టెట్ పరీక్ష
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా, వచ్చే నెల 15న పరీక్ష నిర్వహించనున్న ట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబర్ 27న ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News