Sunday, December 22, 2024

డిఎస్‌సి వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భ ర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష(డిఎస్‌సి) నో టిఫికేషన్ విడుదలయ్యింది. టీచర్ల నియామకాలలో తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్ట్ రిక్రూట్‌మెంట్ టెస్టు …సిబిఆర్‌టి) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి అ క్టోబరు 21 వరకు డిఎస్‌సి దరఖాస్తులు స్వీకర ణ ప్రారంభం కానుండగా, నవంబర్ 20 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నారు. 11 జిల్లాలు…హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సం గారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖ మ్మంలో ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఉద్యోగాలకు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు. వయో పరిమితిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరా లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడు సంవత్సరాలు, ఎస్‌సి,ఎస్‌టి,బిసి, ఇడబ్లూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడిలింపు ఉంటుంది.

డిఎస్‌సి నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ నె ల 20 నుంచి ప్రారంభం కానుండగా, దరఖాస్తు ల సమర్పణకు అక్టోబరు 21 ఆఖరి తేదీ. దరఖా స్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. గతంలో ఉన్న దరఖాస్తు ఫీజు కంటే దాదాపు మూడింత లు ఫీజు పెంచారు. అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో డిఎస్‌సి పరీక్షలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేర కు బి.ఇడి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హులుగా నిర్ణయించారు.

పాత పద్ధ్దతిలోనే నియామకాలు
ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి సంబంధించి రాత పరీక్షను గతంలో మాదిరిగానే నిర్వహించే అవకాశముంది. 2017లో తొలిసారిగా టిఎస్‌పిఎస్‌సి ఆ ధ్వర్యంలో టీచర్ నియామకాలు చేపట్టారు. అం దుకోసం టీచర్ రిక్రూట్ టిఎస్‌పిఎస్‌సికి బదులుగా పాత పద్దతిలోనే పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్ష నిర్వహించనున్నది. రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్ష ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి.. ఆ తర్వాత డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ(డిఎస్‌సి) నేతృత్వంలో నియామకాలు ఖరారు చేయనున్నారు.
వెయిటేజీ విధానం
టెట్ వెయిటేజీ ఇచ్చే విధానాన్ని డిఎస్‌సిలో యథాతథంగా అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. డిఎస్‌సి పరీక్షకు 80 శాతం, టెట్ స్కోర్కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి.. తుది జాబితా రూపొందిస్తారు.
అర్హతలు
స్కూల్ అసిస్టెంట్స్ : సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం(ఎస్‌సి,ఎస్‌టి,బిసి, వికలాంగులకు 45 శాతం) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/పిజి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్ట్ మెథడాలజీగా బి.ఇడి ఉత్తీర్ణత ఉండాలి (లేదా) 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్ టెట్ పేపర్ -2లో అర్హత సాధించాలి.
సెకండరీ గ్రేడ్ టీచర్స్ : ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో 50 శాతం(ఎస్‌సి,ఎస్‌టి,బిసి, వికలాంగులకు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసవ్వాలి లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా ఎన్‌సిటిఇ నిబంధనలు- 2002 ప్రకారం 45 శాతం(ఎస్‌సి,ఎస్‌టి,బిసి, వికలాంగులకు 40 శాతం) మార్కులతో ఇంటర్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసవ్వాలి. దీంతోపాటు టిఎస్ టెట్ లేదా ఎపి టెట్ పేపర్ -1లో లేదా సీటెట్ అర్హత సాధించాలి.
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ : ఇంటర్మీడియేట్‌లో 50 శాతం మార్కులు కలిగి ఉండి, ఎన్‌సిటిఇ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎన్‌సిటిఇ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బిపిఇడి)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
భాషా పండితులు : సంబంధిత భాష ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ 50 శాతం (ఎస్‌సి, ఎస్‌టి, బిసి, వికలాంగులకు 45%) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా సదరు భాష సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పిజి ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్ ఉత్తీర్ణత ఉండాలి. బి.ఇడిలో సంబంధిత భాషను మెథడాలజీగా చదివి ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో నాలుగేళ్ల బిఎ బి.ఇడి/బిఎస్‌సి బి.ఇడి ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు టిఎస్ టెట్ లేదా ఎపి టెట్ పేపర్2లో అర్హత సాధించాలి
80 మార్కులకు రాత పరీక్ష
ఉపాధ్యాయ నియామక పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో 160 ప్రశ్నలతో రెండు భాషలలో(తెలుగు, ఇంగ్లీష్ లేదా ఉర్దూ, ఇంగ్లీష్) ప్రశ్నాపత్రం ఉంటుంది.
డిఎస్‌సి నోటిఫికేషన్ వివరాలు
దరఖాస్తులు ప్రారంభం : సెప్టెంబరు 20
దరఖాస్తులు చివరి తేదీ : అక్టోబరు 21
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్ట్ రిక్రూట్‌మెంట్ టెస్టు –…సిబిఆర్‌టి)
ఆన్‌లైన్ పరీక్షలు : నవంబరు 20 నుంచి 30 వరకు
దరఖాస్తు ఫీజు : రూ.1000
వయసు : 18 నుంచి 44 ఏండ్ల లోపు
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్,నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
వెబ్‌సైట్ : https://schooledu.telangana.gov.in
టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ఈనెల 15వ తేదీన నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పేపర్ -1 పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్షను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను శనివారం (సెప్టెంబరు 9) నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News