Sunday, February 23, 2025

త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా డిఎస్సీ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈమేరకు ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య, త్వరలో పదవీవిరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు వంటివి అధికారులు సేకరిస్తున్నారు.

2023 ఆగస్టులో గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు ఐదువేల ఖాళీల భర్తీకి ఉద్దేశించిన ఈ నోటిఫికేషన్ కు అదనంగా ప్రస్తుత ఖాళీల సంఖ్యను జోడించి, భారీయెత్తున డిఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది 3,800 మంది టీచర్లు పదవీవిరమణ చేయనున్నారు. హైదరాబాద్ లో 370మంది, మేడ్చల్ లో 260మంది, ఖమ్మంలో 240మంది చొప్పున రిటైర్ కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News