Sunday, January 19, 2025

డిఎస్‌సి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు జగన్ ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ 6,100 పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌, 2,280 ఎస్‌జిటి పోస్టులు, 1,264 టిజిటి పోస్టులు, 215 పిజిటి పోస్టులు, 42 ప్రిన్సిపల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు తేదీ ఇచ్చారు. మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్ సి పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 15 వరకు డిఎస్‌సి ఫలితాలు విడుదల చేయనున్నారు. 2018 సిలబస్‌ ప్రకారమే డిఎస్ సి నోటిపికేషన్ ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News