Sunday, December 22, 2024

5089 ఉపాధ్యాయ, 1523 ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టిఆర్‌టి నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం సబితా మీడియాతో మాట్లాడారు. 5089 ఉపాధ్యాయ, 1523 ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. విధివిధానాలు ఖరారు చేస్తున్నామని వివరించారు. త్వరలో డిఎస్‌సి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. తొమ్మిదేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, అన్ని గురుకులాలను డిగ్రీ కాలేజ్ స్థాయికి అప్‌గ్రేడ్ చేశామని మంత్రి సబితా ప్రశంసించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి సబితా వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రభుత్వ లక్షమని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని స్పష్టం చేశారు. ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని మంత్రి సబితా వెల్లడించారు. తెలంగాణలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టామని, ప్రైవేట్ రంగంలో 15 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు.

Also Read: పంచాంగాన్ని నమ్ముకోండి: పోలీసులకు యుపి డిజిపి క్లాసు !(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News