Monday, January 20, 2025

టెట్ పరీక్షలు పూర్తి చేసి డిఎస్‌సి నోటిఫికేషన్ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -
తెలంగాణ నిరుద్యోగ జెఎసి డిమాండ్
విద్యాశాఖ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్ : రాష్ట్రంలో 45 రోజుల్లోగా టెట్ పరీక్షలు పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్‌సి నోటిఫికేషన్ జారీచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో నిరుద్యోగులు విద్యాశాఖ కార్యాలయ్యాన్ని ముట్టడించారు. రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యకులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో తెలంగాణ నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేష్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేక విద్యాప్రమాణాలు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు సైన్స్, మథ్స్, ఇంగ్లీష్, 23 సబ్జెక్టులు చెప్పే పంతుళ్ళు లేక, పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాండ్ చేశారు. ప్రభుత్వ పాటశాలల్లో 24 వేల టీచర్ పోస్టులు, ఎయిడెడ్ పాటశాలల్లో 4900, ఆదర్శ పాటశాలల్లో 2 వేల పోస్టులు, కస్తుర్భా పాఠశాలల్లో 1500 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటితో పాటు ప్రభుత్వ పాటశాలల్లో 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు, 10 వేల పి.ఇ.టి. 5 వేల ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు, 3 వేల లైబ్రేరియన్, 4 వేల జూనియర్ అసిస్టెంట్, 10 వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్కాయన్నారు. – టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని. పర్మనెంట్ టీచర్లను నియమించకుండా టెంపరరీ టీచర్లకు రకరకాల పేర్లతో నియమించి విద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.

పార్ట్ టైం, గెస్ట్, ఆవర్లీ బేస్డ్, విద్యా వాలంటరీలు, కాంట్రాక్టు టీచర్లు అంటూ రకరకాల పేర్లతో సంవత్సరాల తరబడి తాత్కాలిక టీచర్లను నియమించి విద్యా వ్యవస్థను పాడు చేశారని ధ్వజమెత్తారు. కాగా రాష్ట్రంలో 7 లక్షల మంది బిఇడి, డిఇడి, పండిట్ శిక్షణ, పిఇటి చేసిన నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లమీద తిరుగుతున్నారని నీల వెంకటేష్ విమర్శించారు.
కమిషనర్‌కు వినతి పత్రం విద్యాశాఖ కార్యాలయ ముట్టడి అనంతరం 20 మండి బిసి నాయకుల ప్రతినిధి బృందం విద్యాశాఖ కమిషనర్ దేవ సేనను కలిసి వినతి పత్రం సమర్పించింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ మంత్రితో చర్చించి తొందరలోనే తేదీని ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు బిసి నాయకులు తెలిపారు. ఈ ముట్టడి కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్ , జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీరడి భూపేష్ సాగర్, అనంతయ్య, రాజేందర్, నరసింహ గౌడ్, రామ కృష్ణ, నందా గోపాల్, రాజ్ కుమార్, మోడి రాందేవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News