ఛండీగఢ్: అర్జున అవార్డు గ్రహీత డిఎస్‌పి డల్బీర్ సింగ్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పంజాబ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జలంధర్‌లోని బస్తీబవాలో సమీపంలోని ఖేల్ కాలువ సమీపంలో డిఎస్‌పి డల్బీర్ సింగ్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం డిఎస్‌పిదిగా గుర్తించారు. తలపై బలమైన గాయాలున్నట్టు గుర్తించారు. ఆదివారం సాయంత్రం డిఎస్‌పి ఓ స్నేహితుడు బస్టాండ్‌కు సమీపంలో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. గత రాత్రి డిఎస్‌పి రక్తపు మడుగులో మృతదేహం స్థానికులకు కనపించింది. డిఎస్‌పి మృతదేహం వద్ద రివ్వాలర్ కూడా కనిపించడంలేదని పోలీసులు వెల్లడించారు. పదిహేను రోజుల క్రితం వెయిట్‌లిఫ్టర్‌తో సదరు డిఎస్‌పి గొడవ పెట్టుకున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
డిఎస్‌పిని చంపేశారా?…. కాలువ ప్రక్కన మృతదేహం
- Advertisement -
- Advertisement -
- Advertisement -